![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో లేటెస్ట్ ది రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో చాలామంది ఈ షోకి సంబంధించిన ఫాన్స్ ని పిలిచారు. "కడవ మీద కడవ పెట్టి " సాంగ్ కి శ్రీముఖి, హరి, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఫాన్స్ అంతా కూడా డాన్స్ చేశారు. వీళ్లంతా కూడా ఈ షో టైటిల్ తో ఉన్న టీ షర్ట్స్ వేసుకుని వచ్చారు. ఇక అవినాష్ పొరపాటున హరిని పట్టుకుని "తమ్ముడు మీరెప్పటి నుంచి ఫాన్స్ ఫాన్స్ " అని అడిగాడు.
ఇక ఒక ఫ్యాన్ ఐతే "ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానక్కా ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫైనల్లీ ఒక్కసారి నా హార్ట్ పట్టుకోవా అక్కా" అని అడిగాడు. శ్రీముఖి అతని హార్ట్ మీద చెయ్యేసి "నీ హార్ట్ బానే ఉందిరా నీ హార్ట్ మీద ఉన్న ఈ ముఖమే బాలేదు" అంటూ అవినాష్ మీద కామెంట్ చేసింది. "చాలక్కా ఈ జన్మకు" అన్నాడు ఆ ఫ్యాన్. ఇక ఒక లేడీ ఫ్యాన్ ఐతే చేతి మీద "అవి" అని రాసుకొచ్చింది. "అవి అంటే అవినాష్" అని చెప్పింది. "ఆయనకు పెళ్ళై ముగ్గురు పిల్లలున్నారు తెలుసా" అంటూ హరి అనేసరికి "నాకూ పెళ్లయ్యింది.మా హజ్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు " అని రివర్స్ కౌంటర్ వేసింది ఆ లేడీ ఫ్యాన్. ఇక శ్రీముఖి హార్డ్ కోర్ ఫ్యాన్ వచ్చాడు.

అతను అల్లాటప్పా ఫ్యాన్ కాదు. తన చేతి మీద శ్రీముఖి పేరును టాటూగా వేసుకుని వచ్చాడు. అది చూసి శ్రీముఖి ఫిదా ఐపోయింది. ఇక అవినాష్ "శ్రీముఖి అంటే ఎందుకంత ఇష్టం" అని అడిగాడు. "అమ్మ ఎందుకిష్టం అంటే ఎం చెప్తాము" అని ఆ ఫ్యాన్ అనేసరికి అవినాష్, శ్రీముఖి వ్వాహ్ అన్నారు. ఇంకో ఫ్యాన్ ఐతే "ఎన్నో షోస్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో మాత్రం ఎప్పటికీ మా గుండెల్లో ఉంటుంది " అంటూ ఫాన్స్ అంతా గోలగోల చేస్తూ అరుస్తూ చెప్పారు. "నిజానికి నేను ఏఎస్ఎంపి ఫాన్స్ అని పిలిచాను కానీ మీ అందరి ప్రేమ చూస్తుంటే మా ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో మీరంతా మా పరివారంగా వచ్చారు. మీరంతా మా పరివారం" అని చెప్పేసరికి ఫాన్స్ అంతా ఖుషీ ఇపోయారు.
![]() |
![]() |